Abn logo
Jul 20 2021 @ 21:56PM

నిషేధిత గుట్కా స్వాధీనం

జోగులాంబ గద్వాల: అక్రమంగా తరలిస్తున్న గుట్కాను పోలీసులు పట్టుకున్నారు.  కేటీ దొడ్డిలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కే.టి.దొడ్డి మండల కేంద్రంలో రాయచూరు నుంచి గద్వాలకు బస్సులో అక్రమంగా తరలిస్తున్న 54,133 రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి కే.టి.దొడ్డి పోలీసులు రిమాండ్‌కు పంపారు.