Abn logo
Aug 15 2020 @ 18:24PM

అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ పట్టివేత

ప్రకాశం: అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మంగళగిరి నుంచి చెన్నైలోని రెడ్ విల్స్ కు అక్రమంగా లారీలో తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న బియ్యాన్ని సింగరాయకొండ సివిల్ సప్లయ్ గోడౌన్ కు తరలించినట్లు విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. రేషన్ బియ్యాన్ని చెన్నై నల్ల బజారుకు తరలిస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.


Advertisement
Advertisement
Advertisement