సెలెక్ట్ కమిటీ వ్యవహారం: 48 గంటలు ముగియడంతో...

ABN , First Publish Date - 2020-02-15T01:30:28+05:30 IST

ఏపీలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్

సెలెక్ట్ కమిటీ వ్యవహారం: 48 గంటలు ముగియడంతో...

  1. మళ్లీ మొదటికొచ్చిన సెలెక్ట్ కమిటీ వ్యవహారం

అమరావతి: ఏపీలో సెలెక్ట్ కమిటీ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అలాగే సెలెక్ట్ కమిటీకి పేర్లు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి ఛైర్మన్ ఆదేశించారు. కానీ ఛైర్మన్ పంపిన ఫైలును మాత్రం కార్యదర్శి పట్టించుకోకుండా వెనక్కి పంపించారు. దీనిపై మండలి ఛైర్మన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి మండలి ఛైర్మన్ 48 గంటల గడువు ఇచ్చారు. అయినా కార్యదర్శి పట్టించుకోకుండా తిరిగి రెండో సారి కూడా ఫైలును వెనక్కి పంపించారు. చైర్మన్‌ ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో సెలెక్ట్‌ కమిటీల నోటిఫికేషన్‌ ఇవ్వలేనని కార్యదర్శి ఫైలును తిరిగి వెనక్కి పంపించేశారు. 


ఈ వ్యవహారం మరోసారి అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెర లేపింది. ఇరుపక్షాలు విమర్శలు-ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మండలి కార్యదర్శి వ్యవహారించిన తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. చైర్మన్‌ నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదంటూ టీడీపీ ఆరోపిస్తోంది. కార్యదర్శికి మండలి ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అలాగే సెలెక్ట్‌ కమిటీ వ్యవహారంపై కూడా కోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2020-02-15T01:30:28+05:30 IST