బీజేపీలో రహస్య సమావేశాల కలకలం

ABN , First Publish Date - 2022-01-19T18:35:21+05:30 IST

బీజేపీలో రహస్య సమావేశాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్నిరోజులుగా సీనియర్ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

బీజేపీలో రహస్య సమావేశాల కలకలం

హైదరాబాద్: బీజేపీలో రహస్య సమావేశాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్నిరోజులుగా సీనియర్ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. భేటీలో ఎవరెవరు పాల్గొన్నారన్న దానిపై పార్టీ నాయకత్వం ఆరా తీసింది. పార్టీలోని అసంతృప్త వాదులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తూ.. తమను పక్కన పెట్టారని సీనియర్లు వాపోతున్నారు. తమకు ప్రాధాన్యత తగ్గిందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కూడా.. అసంతృప్తి నేతలు సమావేశం అయినట్లు సమాచారం. దీంతో పార్టీ నాయకత్వం అలెర్ట్ అయ్యింది. కొందరు నేతలతో పార్టీ పెద్దలు మాట్లాడారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలపై వేటు పడే అవకాశం ఉంది.

Updated Date - 2022-01-19T18:35:21+05:30 IST