స్వదేశానికి చేరుకోనున్న దేశ బహిష్కరణకు గురైన భారతీయులు

ABN , First Publish Date - 2020-09-20T07:06:10+05:30 IST

సౌదీ అరేబియాలో దేశ బహిష్కరణకు గురైన భారతీయులు సెప్టెంబర్ 24న స్వదేశానికి

స్వదేశానికి చేరుకోనున్న దేశ బహిష్కరణకు గురైన భారతీయులు

రియాద్: సౌదీ అరేబియాలో దేశ బహిష్కరణకు గురైన భారతీయులు సెప్టెంబర్ 24న స్వదేశానికి రానున్నారు. ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో భాగంగా 500 మంది భారతీయులు మే నెలలో స్వదేశానికి చేరుకోగా.. ఇప్పుడు రెండో బ్యాచ్‌ రియాద్-చెన్నై విమానంలో గురువారం దేశానికి రానుంది. దేశ బహిష్కరణకు గురైన భారతీయులకు సంబంధించి సౌదీ డీపోర్టేషన్ సెంటర్లలో నెలకొన్న సమస్యలను తీర్చే పనిలో ఉన్నామని అక్కడి ఇండియన్ ఎంబసీ పేర్కొంది.


భారతీయులను స్వదేశానికి పంపే ముందు ఇరుపక్కల అనేక క్లియరెన్స్‌లను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. మరోపక్క కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు చెప్పింది. దేశ బహిష్కరణకు గురైన మరికొంతమంది భారతీయులు త్వరలో జెడ్డా, రియాద్ నుంచి భారత్‌కు రానున్నట్టు ఇండియన్ ఎంబసీ తెలిపింది. విదేశాంగశాఖ, రియాద్‌లోని ఇండియన్ మిషన్, జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ భారతీయులను స్వదేశానికి పంపేందుకు విమాన ఏర్పాట్లను చేస్తున్నట్టు చెప్పింది.

Updated Date - 2020-09-20T07:06:10+05:30 IST