సీల్డ్‌ కవర్‌లో ఆసరా పింఛన్లు

ABN , First Publish Date - 2020-04-03T07:02:44+05:30 IST

కరోనా దెబ్బతో ఆసరా పింఛన్లను కొత్త విధానంలో అందించనున్నారు. సీల్డ్‌ కవర్లలో నగదును పెట్టి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఈ నెల 5 నుంచి పింఛన్ల పంపిణీని...

సీల్డ్‌ కవర్‌లో ఆసరా పింఛన్లు

రూ.2016, రూ.3016తో వేర్వేరుగా కవర్లు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బతో ఆసరా పింఛన్లను కొత్త విధానంలో అందించనున్నారు. సీల్డ్‌ కవర్లలో నగదును పెట్టి లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. ఈ నెల 5 నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించి 10 రోజుల్లో ముగించనున్నారు. రూ.2016, రూ.3016 నగదుతో కూడిన సీల్డ్‌ కవర్లు సిద్ధం చేస్తున్నారు. పోస్టల్‌ ఖాతాలు ఉన్న లబ్ధిదారులు సబ్‌ లేదా బ్రాంచ్‌ పోస్టు కార్యాలయాలకు వెళ్లి వేలిముద్ర వేసి పింఛను తీసుకోవాల్సి ఉంటుంది. ఖాతాలు ఉన్నప్పటికీ గ్రామంలో పోస్టల్‌ కార్యాలయం లేని చోట సిబ్బంది గ్రామాలకు వెళ్లి బయోమెట్రిక్‌ ద్వారా వేలి ముద్రలు తీసుకుని లబ్ధిదారులకు నగదును పంపిణీ చేస్తారు. పంపిణీ కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 

Updated Date - 2020-04-03T07:02:44+05:30 IST