అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ స్కాం జరిగింది: వర్లరామయ్య

ABN , First Publish Date - 2020-07-06T00:35:09+05:30 IST

అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ స్కాం జరిగిందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఏ2 విజయసాయిరెడ్డి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద మొత్తం సమాచారం ఉందని తెలిపారు.

అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ స్కాం జరిగింది: వర్లరామయ్య

అమరావతి: అంబులెన్స్‌ల వ్యవహారంలో భారీ స్కాం జరిగిందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఏ2 విజయసాయిరెడ్డి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద మొత్తం సమాచారం ఉందని తెలిపారు. సీఎం జగన్‌కు తెలియకుండా మీరు కూడబెట్టిన ఆస్తుల చిట్టాను.. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్‌కు ఇచ్చింది నిజం కాదా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డిని జగన్ కారులో నుంచి దింపలేదా? అని ప్రశ్నించారు. విజయసాయిని మించిన సూట్‌కేసు కంపెనీల సృష్టికర్త ఎవరైనా ఉన్నారా అని నిలదీశారు. దొంగ లెక్కల విజయసాయిరెడ్డికి.. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా? అని వర్లరామయ్య ప్రశ్నించారు.

Updated Date - 2020-07-06T00:35:09+05:30 IST