హృదయాలను క‌లిచి వేస్తున్న వీడియో !

ABN , First Publish Date - 2020-03-29T20:53:21+05:30 IST

ప్ర‌పంచ వ్యాప్తంగా 190కిపైగా దేశాల‌కు వ్యాప్తి చెందిన‌ మ‌హ‌మ్మారి క‌రోనా కార‌ణంగా క‌న్న బిడ్డ‌లను కూడా ద‌గ్గ‌రికి తీసుకోలేని ప‌రిస్థితి దాపురించింది.

హృదయాలను క‌లిచి వేస్తున్న వీడియో !

సౌదీ: ప్ర‌పంచ వ్యాప్తంగా 190కిపైగా దేశాల‌కు వ్యాప్తి చెందిన‌ మ‌హ‌మ్మారి క‌రోనా కార‌ణంగా క‌న్న బిడ్డ‌లను కూడా ద‌గ్గ‌రికి తీసుకోలేని ప‌రిస్థితి దాపురించింది. చైనాలో క‌రోనా బాధితుల‌కు సేవ‌లు చేస్తున్న ఓ న‌ర్స్ త‌న‌ను చూడ‌టానికి ఆస్ప‌త్రికి వ‌చ్చిన క‌న్న కూతురిని వైర‌స్ భ‌యంతో ద‌గ్గ‌ర‌కు తీసుకోలేక దూరం నుంచే పంపించి వేయ‌డం మ‌నం వీడియోలో చూశాం. అప్పుడు ఈ త‌ల్లి, కూతురికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అయింది. ఇప్పుడు ఇదే కోవ‌లో సౌదీ అరేబియాలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో కూడా బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో నెటిజ‌న్ల హృదయాలను క‌లిచి వేస్తోంది.     


వీడియోలోని దృశ్యాల ఆధారంగా సౌదీ అరేబియాకు చెందిన ఓ వైద్యుడు క‌రోనా బాధితుల‌కు చికిత్స చేసి, త‌న డ్యూటీ ముగియ‌గానే మెడిక‌ల్ సూట్‌లోనే ఇంటికి చేరుకున్నారు. తండ్రి ఇంటికి రాగానే అత‌ని కుమారుడు లోప‌లి నుంచి ప‌రిగెత్తుకు వ‌చ్చి ఆయ‌న ద‌గ్గ‌రికి వెళ్లబోయాడు. తాను ఆస్ప‌త్రి నుంచి వ‌స్తున్న విష‌యం గుర్తుకు రావ‌డంతో ఎంతో ప్రేమ‌తో దగ్గ‌రికి వ‌చ్చిన కుమారుడిని తండ్రి ఎత్తుకోలేదు. ద‌గ్గ‌ర‌కు రావొద్ద‌ని ఆ ప‌సివాడిని వారించి అర‌చేతుల్లో ముఖం పెట్టుకుని కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు కూడా భావోద్వేగంగా స్పందిస్తున్నారు.


Updated Date - 2020-03-29T20:53:21+05:30 IST