సాత్విక్‌ జోడీ ఘన బోణీ

ABN , First Publish Date - 2021-03-03T09:45:12+05:30 IST

తెలుగు యువ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేశాడు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌-అశ్వినీ పొన్నప్ప జోడీ 21-18, 21-10తో...

సాత్విక్‌ జోడీ ఘన బోణీ

  • స్విస్‌ ఓపెన్‌


బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): తెలుగు యువ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ముందంజ వేశాడు. మంగళవారం ప్రారంభమైన ఈ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌-అశ్వినీ పొన్నప్ప జోడీ  21-18, 21-10తో ఇండోనేసియాకు చెందిన రెండోసీడ్‌ హఫీజ్‌ ఫైజల్‌-గ్లోరియా ఎమ్మాన్యుయెల్‌ జంటను చిత్తుచేసి రెండోరౌండ్‌కు దూసుకెళ్లింది. మరో భారత ద్వయం ప్రణవ్‌ చోప్రా-సిక్కి రెడ్డి 18-21, 15-21తో ఇంగ్లండ్‌కు చెందిన మూడోసీడ్‌ మార్కస్‌ ఎలి్‌స-లారెన్‌ స్మిత్‌ జోడీ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సింగిల్స్‌ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ తమ తొలిరౌండ్‌ మ్యాచ్‌లను బుధవారం ఆడనున్నారు.


Updated Date - 2021-03-03T09:45:12+05:30 IST