15వ అర్థిక సంఘం పెండింగ్ బకాయిల పై Sarpanch ల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-06-04T20:27:36+05:30 IST

15వ ఆర్థిక సంఘం బకాయిలపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు అందే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం

15వ అర్థిక సంఘం పెండింగ్ బకాయిల పై Sarpanch ల ఆగ్రహం

హైదరాబాద్: 15వ ఆర్థిక సంఘం బకాయిలపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు అందే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం (telangana sarpanch association) నేతలు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(errabelli dayakar rao)ని హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఒకవైపు ఉపాధి హామీ నిధులను, మరో వైపు 15 వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా కేంద్రం ఆపేసింది. దీంతో స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతుంది. ఇంకోవైపు చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని ఆ సంఘం ప్రతినిధులు మంత్రికి వివరించినట్టు తెలిపారు. 


ఆ నిధులు వచ్చేలా కేంద్రం పై వత్తిడి తేవాలని చెప్పామన్నారు. ఉపాధి హామీలో మెటీరియల్ కంపో మెంట్, లేబర్ కాంపో నెంట్ ఆగి పోయాయి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్రం స్థానిక సంస్థలకు నిధులు ఇస్తున్నది. కేంద్రం నిధులు నిలిపిన ఈ దశలోనూ రాష్ట్రం నిధులు ఇస్తూనే ఉన్నదన్నారు. ఈ ఏడాది మే వరకు రాష్ట్రం నిధులు ఇచ్చినట్లు వారు వివరించారు. రాష్ట్రంపై కేంద్రం వివక్షను వారు విమర్శించారు. మంత్రి ని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు సుర్వి యాదయ్య, బూడిద రామ్ రెడ్డి, ఉదయశ్రి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-06-04T20:27:36+05:30 IST