హైదరాబాద్: సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు'కు నామినేషన్లను ఆగస్ట్ 15వ తేదీ వరకూ స్వీకరించనున్నారు. భారతదేశ ఐక్యత, సమగ్రతకు తోడ్పడే విభాగంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన 'సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు'కు కేంద్ర హోంశాఖ ఆన్‌లైన్ నామినేషన్ లను స్వీకరిస్తుంది.నామినేషన్ల గడువును ఆగస్టు 15వ తేదీ వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్ https://nationalunityawards.mha.gov.in లో ఆన్‌లైన్‌లో నామినేషన్ల ప్రక్రియ, అవార్డు విధివిధానాలు పొందుపరిచారు.కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట అవార్డును ఏర్పాటు చేసింది. జాతీయ సమైక్యత, సమగ్రతను ప్రోత్సహించడానికి ఈ అవార్డును అందజేయనున్నారు.