ములుగు: కన్నెపల్లి నుంచి జంపన్న వాగుకు సారలమ్మ అమ్మవారు చేరారు. మరికొద్దిసేపట్లో మేడారానికి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు చేరుకోనున్నారు. మూడంచెల పోలీస్ భద్రత మధ్య సారలమ్మ దేవతను తరలిస్తారు. ఆదివాసీ సంప్రదాయాలతో వన దేవతల తరలింపు ఉంటుంది. సారలమ్మ దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. ఆధ్యాత్మిక శోభతో మేడారం వెలిగిపోతోంది.
ఇవి కూడా చదవండి