శానిటైజర్ల సర్వీస్‌

ABN , First Publish Date - 2020-03-25T06:16:39+05:30 IST

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకం... చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కానీ అందుకు తగినన్ని శానిటైజర్లు అందుబాటులో లేవు. ఉన్నా... ప్రమాణాలు పాటించకుండా... మార్కెట్‌లోకి వదిలేసి సొమ్ము చేసుకొంటున్న కంపెనీలే ఎక్కువ.

శానిటైజర్ల సర్వీస్‌

కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకం... చేతులు శుభ్రంగా కడుక్కోవడం. కానీ అందుకు తగినన్ని శానిటైజర్లు అందుబాటులో లేవు. ఉన్నా... ప్రమాణాలు పాటించకుండా... మార్కెట్‌లోకి వదిలేసి సొమ్ము చేసుకొంటున్న కంపెనీలే ఎక్కువ. వీటితో రుద్దుకొంటే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. దీన్ని గ్రహించిన ఇంఫాల్‌లోని మణిపూర్‌ విశ్వవిద్యాలయం (ఎంయూ) కెమిస్ట్రీ విభాగం విద్యార్థులు శానిటైజర్లు తయారు చేశారు. 500 బాటిళ్లు సిద్ధం చేసి తమ కమ్యూనిటీ వారికి ఉచితంగా పంచి పెట్టారు. త్వరలో మరో వెయ్యి బాటిళ్ల ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లు అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘మొదట్లో ఒక్కోటీ 200 మి.లీ. చొప్పున 200 బాటిల్స్‌ మా లేబొరేటరీలో తయారు చేశాం. ఇందులో ఇథైల్‌ ఆల్కహాల్‌ 80-90 శాతం, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, గ్లిజరిన్‌, డిస్టిల్డ్‌ వాటర్‌ ఉపయోగించాం. స్థానిక కంపెనీ నుంచి ఖాళీ సీసాలు తెచ్చి, వాటిల్లో నింపి, పంపిణీ చేశాం’ అని ఎంయూ కెమిస్ర్టీ విభాగాధిపతి కోక్లామ్‌ ముఖర్జీ చెప్పారు. ఈ స్ఫూర్తితో వర్సిటీ రీసెర్చ్‌ స్కాలర్స్‌ మరిన్ని ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. కొన్నింటిని ఆలిండియా రేడియో ఉద్యోగులకు కూడా అందించారు.

Updated Date - 2020-03-25T06:16:39+05:30 IST