శానిటైజేషన్‌ కోసం కొత్త యంత్రాలు

ABN , First Publish Date - 2020-04-05T05:51:17+05:30 IST

కరోనా కట్టడి కోసం పలు సంస్థలు రకరకాల యంత్రాలను తయారు చేస్తున్నాయి. తాజాగా డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) శానిటైజేషన్‌ కోసం రెండు...

శానిటైజేషన్‌ కోసం కొత్త యంత్రాలు

ఏప్రిల్‌ 4: కరోనా కట్టడి కోసం పలు సంస్థలు రకరకాల యంత్రాలను తయారు చేస్తున్నాయి.  తాజాగా డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) శానిటైజేషన్‌ కోసం రెండు కొత్త యంత్రాలను రూపొందించింది. వీటిని చిన్న ప్రదేశాల అవసరాల కోసం, పెద్ద పెద్ద ప్రదేశాల అవసరాల కోసం ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు ప్రత్యేక మాస్కులు, వెంటిలేటర్లు, సేప్టీ సూట్ల వంటి పరికరాలను డిఆర్‌డిఓ రూపొందించింది. ఈ సంస్థకు చెందిన ఢిల్లీలోని ప్రత్యేక విభాగం శాటిటైజేషన్‌ కోసం రెండు ఆకృతులను సిద్ధం చేసింది. మంటలు అదుపు చేసేందుకు చేసిన ప్రయోగాల నుంచి శానిటైజేషన్‌ యంత్రాలు రూపొందించింది.


అందులో మొదటిది భుజానికి తగిలించుకుని సులువుగా తీసుకుపోగలిగే (బ్యాక్‌ప్యాక్‌) పరికరం కాగా రెండోది ట్రాలీలో తీసుకువెళ్ళగలిగేది. మొదటిది వైరస్‌ అనుమానిత ప్రాంతాల్లో  ఒక శాతం హైపోక్లోరేట్‌ ద్రావణాన్ని స్ర్పే చేసేందుకు ఉద్దేశించింది. సిబ్బంది తమ వీపు వెనుక భాగంలో దీన్ని ఉంచుకుని ఎక్కడికైనా తీసుకెళ్ళి  స్ర్పే చేయవచ్చు. రెండు, మూడు వందల చదరపు మీటర్ల మేర అంటే ఆఫీసు రూమ్‌లు, రిసెప్షన్లు తదితర ప్రాంతాల్లో స్ర్పే చేసేందుకు ఉపయోగపడుతుంది.


రెండో దాంట్లో 50 లీటర్ల ద్రావణాన్ని ఉంచవచ్చు. 12 - 15 మీటర్ల దూరం వరకు పిచికారి చేయవచ్చు. ఆసుపత్రులు మొదలుకుని కార్యాలయాలు, పబ్లిక్‌ కారిడార్లు, మెట్రో, ఇతర రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద వీటిని ఉపయోగించవచ్చు. ఒకసారి ఈ యంత్రాన్ని నింపితే దాదాపు 3000 చదరపు మీటర్ల ప్రదే శాన్ని డిస్‌ఇన్ఫెక్ట్‌ చేయవచ్చు. వీటిని ఇప్పటికే ఢిల్లీ పోలీసు విభాగానికి అందజేశారు. 

Updated Date - 2020-04-05T05:51:17+05:30 IST