సింగూర్ ప్రాజెక్ట్‌లోకి తగ్గిన వరద ప్రవాహం

ABN , First Publish Date - 2020-09-20T14:17:44+05:30 IST

జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం స్వల్పంగా తగ్గింది.

సింగూర్ ప్రాజెక్ట్‌లోకి తగ్గిన వరద ప్రవాహం

సంగారెడ్డి: జిల్లాలోని సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం స్వల్పంగా తగ్గింది. సింగూర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 16.722 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి నీటి ఇన్ ఫ్లో 19032 క్యూసెక్కులుగా  కొనసాగుతోంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు 60 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టులో నీటి ఆవిరి, లికేజ్ ద్వారా 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సింగూర్ ప్రాజెక్టులో మొత్తం నీటి ఔట్ ఫ్లో 120 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే సింగూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2020-09-20T14:17:44+05:30 IST