ముందే వచ్చేస్తున్న శాంసంగ్ ‘గెలాక్సీ ఎ01 ఎస్’

ABN , First Publish Date - 2020-07-05T01:20:29+05:30 IST

శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ (3జీబీ ర్యామ్) స్మార్ట్‌ఫోన్ అనుకున్నదాని కంటే ముందే లాంచింగ్‌కు సిద్ధమవుతోంది.

ముందే వచ్చేస్తున్న శాంసంగ్ ‘గెలాక్సీ ఎ01 ఎస్’

న్యూఢిల్లీ: శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్ (3జీబీ ర్యామ్) స్మార్ట్‌ఫోన్ అనుకున్నదాని కంటే ముందే లాంచింగ్‌కు సిద్ధమవుతోంది. ఇందులో మరిన్ని వేరియంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 3జీబీ వేరియంట్‌తోపాటు 2జీబీ ర్యామ్ వేరియంట్ గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో కనిపించింది. అయితే ఇంతకుమించిన వివరాలు వెల్లడి కాలేదు. ధర, ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ.. వంటి వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు. అయితే, భారత్‌లో త్వరలోనే ఈ ఫోన్ విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. 


ఇటీవలి లీకుల ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ ఎం01 ఎస్ ఫోన్ గతేడాది వచ్చిన గెలాక్సీ ఏ10ఎస్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా తెలుస్తోంది. గెలాక్సీ ఎ10ఎస్ ధర రూ. 12,480 మాత్రమే. ‘శాంసంగ్ గెలాక్సీ ఎ01ఎస్‌గెలాక్సీఎ10ఎస్’గా గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్‌లో గుర్తించారు.


ఇక స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఆక్టాకోర్ మీడియాటెక్ ఎంటీ6762 (హెలియో పీ22) ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 32 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే, ఇందులో పలు ర్యామ్ వేరియంట్లు ఉన్నట్టు సమాచారం. ఈ ఫోన్ ధర రూ. 10 వేల లోపు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Updated Date - 2020-07-05T01:20:29+05:30 IST