సింధు, సమీర్‌ అవుట్‌

ABN , First Publish Date - 2021-01-23T09:31:12+05:30 IST

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో చుక్కెదురైంది. అలాగే పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ కూడా పరాజయంతో

సింధు, సమీర్‌ అవుట్‌

  • థాయ్‌లాండ్‌ ఓపెన్‌
  • సాత్విక్‌కు ‘జంట’ విజయాలు

బ్యాంకాక్‌: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ఫైనల్లో చుక్కెదురైంది. అలాగే పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ కూడా పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అయితే సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి అదరగొట్టే ప్రదర్శనతో ‘జంట’ విజయాలు అందుకున్నాడు. పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌లో అతడు సెమీఫైనల్‌కు దూసుకు పోయాడు. స్థానిక స్టార్‌, ఫేవరెట్‌ రచనోక్‌ ఇంటానన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు అత్యంత పేలవంగా ఆడింది. ఫలితంగా 13-21, 9-21 స్కోరుతో వరుస గేముల్లో ఓడి ఇంటిముఖం పట్టింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో సమీర్‌ వర్మ 13-21, 21-19, 20-22 స్కోరుతో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ఆంటొన్‌సెన్‌ (డెన్కార్క్‌) చేతిలో పోరాడి ఓడాడు. 


సాయిరాజ్‌ అదరహో: సింగిల్స్‌లో భారత్‌ పోరాటం ముగియగా డబుల్స్‌ జోడీలు అద్భుతంగా ఆడి టైటిళ్లపై ఆశలు నిలిపాయి. సాత్విక్‌/అశ్వినీ పొన్నప్ప జోడీ అసమాన పోరాటంతో 18-21, 24-22, 22-20 స్కోరుతో ప్రపంచ ఆరో ర్యాంక్‌ జోడీ సెంగ్‌ సూన్‌/లియు యింగ్‌ (మలేసియా)కు షాకిచ్చి మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సెమీ్‌సకు చేరింది. అలాగే చిరాగ్‌ షెట్టి జంటగా సాత్విక్‌ 21-18, 24-22 స్కోరుతో ఓంగ్‌ సిన్‌/తియో ఈ (మలేసియా)ను చిత్తుచేసి పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. 

Updated Date - 2021-01-23T09:31:12+05:30 IST