Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 29 2021 @ 17:43PM

దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ వాడారు: సజ్జనార్‌

హైదరాబాద్‌: కూకట్‌పల్లి దోపిడీకి కంట్రీ మేడ్ రివాల్వర్ వాడారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనా స్థలంలో ఒక మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇది బయట గ్యాంగ్ పనేనని పేర్కొన్నారు. కాల్చిన తీరు చూస్తే వాళ్లు పక్కా ప్రొఫెషనల్స్‌గా ఉన్నారని, ఎస్‌వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులతో 6 ప్రత్యేక బృందాలను నిందితులను పట్టుకోవడానికి ఏర్పాటు చేశామని సజ్జనార్‌ తెలిపారు. 


 నగరంలోని కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై దుండగుల కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్‌తోపాటు ఏటీఎం సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఇద్దరిపై కాల్పులు జరిపిన దుండగులు డబ్బులు దోచుకెళ్లారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ అలీ మృతి  చెందాడు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ పొట్టలోకి బుల్లెట్స్ దూసుకెళ్లింది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆలీ మృతి చెందాడు.

Advertisement
Advertisement