Abn logo
May 14 2021 @ 13:01PM

కరోనా రోగులపై కరుణ చూపని తెలుగు రాష్ట్రాల సీఎంలు: శైలజానాథ్

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా రోగులపై కరుణ, మానవత్వం చూపడం లేదని ఏపీసీసీ చీఫ్ డా సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్సులు అటు ఇటు స్వేచ్ఛగా అనుమతించాలన్నారు. తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కలసి ప్రజల ప్రాణాలు కాపాడడానికి తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. పుల్లూరు దగ్గర రోగి మరణించడం మానవత్వానికే ప్రశ్నగా మారిందన్నారు. పుల్లూరు ఘటన ఎక్కడా పునరావృతం కాకూడదని శైలజానాథ్ పేర్కొన్నారు.

Advertisement