Huge scam: స్థలాల పేరిట సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసం

ABN , First Publish Date - 2022-07-30T18:29:41+05:30 IST

స్థలాల పేరిట సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసానికి పాల్పడింది. అమీన్పూర్లో 23 ఎకరాల్లో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ వేసింది.

Huge scam: స్థలాల పేరిట సాహితీ ఇన్ఫ్రాటెక్ భారీ మోసం

హైదరాబాద్: స్థలాల పేరిట సాహితీ ఇన్ఫ్రాటెక్ (sahitya infratech) భారీ మోసానికి పాల్పడింది. అమీన్పూర్లో 23 ఎకరాల్లో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్ వేసింది. వెంచర్లో మొత్తం 4,300 ప్లాట్లు అంటూ నిర్మాణ సంస్థ ప్రచారం చేసింది. 2019 జూన్లో ప్రీలాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఫ్లాట్లను విక్రయించింది. ప్రీ లాంచ్లో దాదాపు 1200 మందికిపైగా కస్టమర్లు ప్లాట్లు కొనుగోలు చేశారు. 2023 మార్చి కల్లా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పని నిర్మాణ సంస్థ ఇంతవరకూ ఇళ్ల నిర్మాణం చేపట్టని పరిస్థితి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.25 లక్షలు, ట్రిపుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.35 లక్షలు చొప్పున వసూలు చేసింది. తాము మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సాహితీ ఇన్ఫ్రాటెక్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-07-30T18:29:41+05:30 IST