ఐదేళ్లలో సామర్థ్యం రెట్టింపు

ABN , First Publish Date - 2020-08-12T06:20:18+05:30 IST

సాగర్‌ సిమెంట్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 57.5 లక్షల టన్నులు ఉండగా...

ఐదేళ్లలో సామర్థ్యం రెట్టింపు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సాగర్‌ సిమెంట్స్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2025 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 57.5 లక్షల టన్నులు ఉండగా.. 2025 నాటికి కోటి టన్నులకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు సాగర్‌ సిమెంట్స్‌ సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ప్రతి పదేళ్లకు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలన్నది కంపెనీ లక్ష్యమని వివరించారు. మధ్యప్రదేశ్‌, ఒడిశాల్లో సాగర్‌ సిమెంట్స్‌ రెండు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది.


10 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన సద్గురు సిమెంట్స్‌లో పెట్టుబడులు మధ్య భారత మార్కెట్లో కంపెనీ ఉనికిని పెంచనుంది. అలానే 15 లక్షల వార్షిక సామర్థ్యం కలిగిన జాజ్‌పూర్‌ సిమెంట్స్‌ గ్రైండింగ్‌ యూనిట్‌ తూర్పు ప్రాంత అవసరాలను తీర్చనుంది. ఈ రెండు ప్రాజెక్టులు 2021 సెప్టెంబరు నాటికి పూర్తి కాగలవని కంపెనీ భావిస్తోంది. సద్గురు సిమెంట్‌ లో రూ.488 కోట్లతో 65 శాతం వాటా తీసుకుంది. జాజ్‌పూర్‌ సిమెంట్స్‌లో 100 శాతం వాటా ఉంది. దీనిపై రూ.312 కోట్ల పెట్టుబడులు పెట్టింది.


Updated Date - 2020-08-12T06:20:18+05:30 IST