Abn logo
Aug 1 2021 @ 21:29PM

Mulugu : ఫ్రెండ్ షిప్ డే రోజు పెను విషాదం

File photo

ములుగు/ఖమ్మం జిల్లా : ఫ్రెండ్ షిప్ డే రోజు ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ ఫ్రెండ్ షిప్ డే కావడంతో కొందరు యువకులు సరదాగా వాజేడు మండలం కొంగాల జలపాతం సందర్శనకు వెళ్లారు. అయితే.. అరగంట వ్యవధిలోనే పెను విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకు చెందిన యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న చుట్టు పక్కల ప్రాంతం వారు వారిని వెతికారు. గల్లంతైన వారిలో ఒక యువకుడు భూపాలపల్లి జిల్లా కేంద్రానికి మునిగెల నరేష్ (24)గా గుర్తించారు. మరో యువకుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన రవితేజ చారి అని గుర్తించారు. ఇతను కొండాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా గల్లంతైన వారి కోసం ఇంకా స్థానికులు, గజఈతగాళ్లు గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.