ఫేర్ వెల్ మ్యాచ్.. బీసీసీఐని సచిన్ అడిగింది ఇదే

ABN , First Publish Date - 2022-02-23T21:17:40+05:30 IST

తన కెరీర్ లో చివరి, 200వ టెస్ట్ మ్యాచ్ ను ముంబైలో జరిగేలా చూడాలని బీసీసీఐని కోరాడు. అయితే దీనికి ముంబై.. సచిన్ హోమ్ గ్రౌండ్ కావడం ఒక్కటే కారణం కాదు. చివరి మ్యాచ్ ముంబైలో జరిగితేనే తన తల్లి ఆ మ్యాచ్ ను చూడగలదని, దీనికి అంగీకరించి ముంబైలోనే మ్యాచ్ జరిగేలా చూడాలని సచిన్ కోరాడు.

ఫేర్ వెల్ మ్యాచ్.. బీసీసీఐని సచిన్ అడిగింది ఇదే

ముంబై: దాదాపు ఇరవై నాలుగేళ్లపాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్ 2013లో అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రతి ఆటగాడి జీవితంలో ఫేర్ వెల్ మ్యాచ్ చాలా కీలకం. సచిన్ కూడా తన వీడ్కోలు మ్యాచ్‌ను అంతే స్పెషల్ గా మలచుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బీసీసీఐకి సచిన్ ఒక విజ్ఞప్తి చేశాడు. తన కెరీర్ లో చివరి, 200వ టెస్ట్ మ్యాచ్ ను ముంబైలో జరిగేలా చూడాలని బీసీసీఐని కోరాడు. అయితే దీనికి ముంబై.. సచిన్ హోమ్ గ్రౌండ్ కావడం ఒక్కటే కారణం కాదు. చివరి మ్యాచ్ ముంబైలో జరిగితేనే తన తల్లి ఆ మ్యాచ్ ను చూడగలదని, దీనికి అంగీకరించి ముంబైలోనే మ్యాచ్ జరిగేలా చూడాలని సచిన్ కోరాడు.


సచిన్ కోరిక మేరకు బీసీసీఐ ఆ టెస్ట్ మ్యాచ్ ను ముంబైలోనే నిర్వహించింది. దీంతో ఆ మ్యాచ్ కు సచిన్ తల్లితోపాటు కుటుంబమంతా హాజరైంది. కెరీర్ మొత్తంలో తన తల్లి ప్రత్యక్షంగా చూసిన ఒకే ఒక మ్యాచ్ అదని సచిన్ వెల్లడించాడు. తాను గ్రౌండ్ లో ఆడుతుంటే, తల్లి బిగ్ స్క్రీన్ పై కనిపించిందని, ప్రేక్షకులంతా ఆమె స్పందన కోసం ఎదురు చూశారని, ఆ సమయంలో ఎంతో భావోద్వేగానికి గురయ్యానని సచిన్ చెప్పాడు. తన కుటుంబంలో సోదరుడు కాకుండా, మరెవరూ తన మ్యాచ్ లను ప్రత్యక్షంగా చూడలేదని కూడా సచిన్ వివరించాడు. ఈ మధ్య ఓ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ ఈ వివరాల్ని బయటపెట్టాడు. 1989లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సచిన్.. 16, నవంబర్ 2013 వరకు ఆటగాడిగా కొనసాగారు. సచిన్ తన కెరీర్ మొత్తంలో 200 టెస్ట్ మ్యాచ్ లు, 463 వన్డే మ్యాచ్ లు ఆడారు.

Updated Date - 2022-02-23T21:17:40+05:30 IST