రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటు: సబితా ఇంద్రారెడ్డి

ABN , First Publish Date - 2021-12-04T15:36:59+05:30 IST

రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటు: సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకి తీరని లోటని మంత్రి పేర్కొన్నారు. రోశయ్య మంత్రివర్గంలో మంత్రిగా పని చేసిన రోజులను సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. రోశయ్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నానని సబిత తెలిపారు.


Updated Date - 2021-12-04T15:36:59+05:30 IST