Abn logo
Jul 6 2021 @ 18:11PM

జగన్ అక్రమాస్తుల కేసులో సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్

హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ  సమయం కోరింది. దీంతో విచారణను ఈ నెల 13కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.


రిటైర్డ్‌ ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. పెన్నా సిమెంట్స్ కేసు నుంచి శామ్యూల్‌ను తొలగించవద్దని సీబీఐ కోరింది. పయనీర్ హాలీడే రిసార్ట్స్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు  సీబీఐ సమయం కోరింది. అలాగే పీఆర్ ఎనర్జీ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ సమయం కోరింది.  పెన్నా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఈ నెల 13కి కోర్టు వాయిదా వేసింది. 

క్రైమ్ మరిన్ని...