సంక్రాంతి వరకూ రైతుబంధు సంబురాలు: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-01-09T01:52:02+05:30 IST

తెలంగాణలో జరుగుతున్న రైతు బంధు సంబురాలను సంక్రాంతి వరకు పొడిగిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

సంక్రాంతి వరకూ రైతుబంధు సంబురాలు: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో జరుగుతున్న రైతు బంధు సంబురాలను సంక్రాంతి వరకు పొడిగిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పొలాల్లో రైతులు, పాఠశాలలలో విద్యార్థులతో రైతుబంధు సంబరాలు జరుగుతున్నాయి.శనివారం నుండి  పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో తెలంగాణ వ్యవసాయ ముఖచిత్రం ఆవిష్కృతం అయిందని మంత్రి తెలిపారు. 


సమైఖ్య పాలనలో రైతుల కష్టాలు, కేసీఆర్ పాలనలో వచ్చిన మార్పును కళ్లకు కట్టినట్లు విద్యార్థులు వెల్లడించారని ఆయన తెలిపారు. గ్రామాల్లో సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలు కొనసాగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు అనుకున్న సంబరాలు సంక్రాంతి వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని రైతు సోదరులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్ నిబంధనల మేరకు ర్యాలీలకు, ఊరేగింపు అనుమతి లేని నేపథ్యంలో ఎక్కడికక్కడ నిబంధనల మేరకు జరుపుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-01-09T01:52:02+05:30 IST