సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబంధు వేడుకలు

ABN , First Publish Date - 2022-01-10T00:58:18+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అమలు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్నారు.

సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబంధు వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం అమలు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోనూ ఈ నెల 10 వ తేదీ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో  రైతుబందు వేడుకలు నిర్వహించనున్నారు. రైతుబందు పథకం కింద 50 వేల కోట్ల రూపాయలు రైతులకు పంట పెట్టుబడి కోసం అందించిన సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ రకాల రంగులతో రూపొందించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చిత్రాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరిస్తారని ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. 


అంతేకాకుండా సంక్రాంతి పండుగ ను తలపించేలా గంగిరెద్దుల ఆటలు, చెరుకు గడల అలంకరణ, గొబ్బెమ్మల ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు జరుగుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శన ను మంత్రి తలసాని ప్రారంభిస్తారని చెప్పారు. ఈ వేడుకలలో. హోంమంత్రి మహమూద్ అలీ, నగరంలోని ఎంఎల్ఏ లు, ఎమ్మెల్సీలు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లతో పాటు టీఆర్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని పార్టీ నాయకులు వివరించారు.

Updated Date - 2022-01-10T00:58:18+05:30 IST