ష్యా దెబ్బకు రష్యన్లే బలవుతున్నారు...

ABN , First Publish Date - 2022-02-24T00:08:31+05:30 IST

ష్యా దెబ్బకు రష్యన్లే బలవుతున్నారు...

ష్యా దెబ్బకు రష్యన్లే బలవుతున్నారు...

లక్షల కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్తలు

* 343 బిలియన్లకు పడిపోయిన 23 మంది బిలియనీర్ల సంపద

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన నేపధ్యంలో...  మిగిలిన దేశాల కంటే కూడా రష్యాలోని వ్యాపారవేత్తలే ఎక్కువగా నష్టపోతున్నారు. ఆయా దేశాలు ఆంక్షలు విధించడంతో రష్యా లోని 23మంది బిలియనీర్ల సంపద 343 బిలియన్లకి పడిపోయింది. గత ఏడాది చివరి నాటికి ఇది 375 బిలియన్ డాలర్లు ఉండగా, రెండు నెలల నుంచి చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో... ఈ పరిస్థితి నెలకొంది. ధనవంతులు, వ్యాపారవేత్తలు కోల్పోయిన సంపద... భారత కరెన్సీలో 23,85,29,60,00,000. గెన్నడీ టిమ్‌చెన్కో ఆస్తుల్లో మూడింట ఓ వంతు కోతపడినట్లు అంచనా. ఈయన 1990 ల్లో పుతిన్‌కి చాలా దగ్గరగా వ్యవహరించిన ఓ అధికారి కుమారుడు. తాజా పరిణామాలకు ముందు టిమ్‌చెన్కో సంపద 48 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఇప్పుడది 16 బిలియన్ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్ చెబుతోంది.


 రష్యా సావరిన్ డెట్ బాండ్లపై ఆంక్షలు విధిస్తూ జో బైడెన్ సంతకం చేయడంతో పాటు, రష్యా మొహరించిన బాల్టిక్స్ వద్దకు నాటో బలగాలకు మద్దతుగా అమెరిఈ క్రమంలో రష్యాలోని ఆయిల్ కంపెనీల యజమానులతో పాటు ఇతర పారిశ్రామికవేత్తల సంపద హరించుకుపోతోంది. ఈ క్రమంలో... పుతిన్ వైఖరి... ప్రపంచమార్కెట్లతో పాటు రష్యా లోని వ్యాపారవేత్తలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతున్నట్లవుతోంది. 

Updated Date - 2022-02-24T00:08:31+05:30 IST