Abn logo
Jan 25 2021 @ 03:38AM

రష్యా వ్యాక్సిన్‌కు అక్కడా అనుమతి.. అయితే ఒక షరతు!

ఇస్లామాబాద్: రష్యా రూపొందించిన కరోనా టీకా స్ఫూత్నిక్-వీకి పాక్ ప్రభుత్వం తాజాగా అత్యవసన వినియెగానికి అనుమతించింది. ఈ టీకా దిగుమతి, పంపిణీ చేసేందుకు స్థానిక సంస్థకు అనుమతులు మంజూరు చేసింది. పాక్‌ అనుమతించిన మూడో టీకా స్ఫూత్నిక్-వీ.  పాక్ ఔషధ నియంత్రణ సంస్థ జరిపిన సమవేశంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఏజీపీ ఫార్మాసుటికల్ కంపెనీని రష్యా టీకాను దిగుమతి చేసుకునే ఏకైక కంపెనీగా పాక్ ప్రభుత్వం ఎంపిక చేసింది.


గత 24 గంటల్లో పాక్‌లో 48 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో..అక్కడ మొత్తం మరణాల సంఖ్య 11295కి చేరింది. జాతియ ఆరోగ్య సేవల మంత్రిత్వ శాఖ తాజాగా సమాచారం ప్రకారం.. పాక్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5.32 లక్షలకు చేరుకోగా.. దాదాపు 4.86 మంది కరోనా నుంచి బయటపడ్డారు.

Advertisement
Advertisement
Advertisement