రష్యాలో గడిచిన 24 గంటల్లో 5 వేలకు పైగా కేసులు

ABN , First Publish Date - 2020-08-04T03:47:03+05:30 IST

రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 5,394 కరోనా కేసులు నమోదైనట్టు రష్యాలోని

రష్యాలో గడిచిన 24 గంటల్లో 5 వేలకు పైగా కేసులు

మాస్కో: రష్యాను కరోనా మహమ్మారి వణికిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రష్యా వ్యాప్తంగా 5,394 కరోనా కేసులు నమోదైనట్టు రష్యాలోని రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8,56,264కు చేరింది. మొత్తం 83 ప్రాంతాల నుంచి ఈ కేసులు బయటపడినట్టు రెస్పాన్స్ సెంటర్ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో 1,413 మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. రష్యాలో నిత్యం రాజధాని మాస్కో ప్రాంతం నుంచే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 693 కేసులు ఒక్క మాస్కోలోనే బయటపడ్డాయి. మరోపక్క కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో రష్యాలో 79 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,207కు చేరుకుంది. ఇక ఒకేరోజు 3,420 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రష్యాలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,53,593కు చేరింది. రష్యా ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల పరీక్షలు నిర్వహించింది. కాగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, భారత్ దేశాలున్నాయి.

Updated Date - 2020-08-04T03:47:03+05:30 IST