Ap HIghCourt: రుషికొండలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఊరుకోబోం

ABN , First Publish Date - 2022-09-06T04:24:40+05:30 IST

రుషికొండలో అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేతకు ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు..

Ap HIghCourt: రుషికొండలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఊరుకోబోం

అమరావతి (Amaravati): రుషికొండ (RushiKonda)లో అక్రమ నిర్మాణాలు (Illigal Constructions) చేస్తే కూల్చివేత (Demolition)కు ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు (Highcourt) హెచ్చరించింది. రుషికొండలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ జనసేన తరపున దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ల‌పై సీనియర్ న్యాయవాది కేఎస్‌ మూర్తి తన వాదనలు వినిపించారు. అయితే విచారణ రెండువారాలకు వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ లోపు అక్రమ నిర్మాణాలు చేస్తారని జనసేన న్యాయవాది వాదించారు. దీంతో రుషికొండలో అక్రమ నిర్మాణాలు చేస్తే ఊరుకోబోమని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే కూల్చివేతకు ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది.  కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2022-09-06T04:24:40+05:30 IST