2 రోజుల్లో రూ.5 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2022-06-25T09:31:01+05:30 IST

భారత స్టాక్‌ మార్కెట్లో కొనసాగిన రెండు రోజుల రిలీఫ్‌ ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

2 రోజుల్లో రూ.5 లక్షల కోట్లు

భారీగా పెరిగిన స్టాక్‌ మార్కెట్‌ సంపద 

మరో 462 పాయింట్లు లాభపడిన  సెన్సెక్స్‌

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లో కొనసాగిన రెండు రోజుల రిలీఫ్‌ ర్యాలీలో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.242.27 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో శుక్రవారం మదుపర్లు ఆటో, బ్యాంకింగ్‌, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. తత్ఫలితంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు దాదాపు ఒక శాతం మేర పెరిగాయి. బీఎ స్‌ఈ సెన్సెక్స్‌ 462.26 పాయింట్లు బలపడి 52,727.98 వద్దకు చేరుకుంది. ప్రారంభ ట్రేడింగ్‌లో సూచీ 644 పాయింట్ల వరకు పుంజుకుంది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 142.60 పాయింట్ల లాభంతో 15,699.25 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 23 లాభాల్లో ముగిశాయి. ఎం అండ్‌ ఎం 4.28 శాతం ఎగిసి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. 

ఆగని రూపాయి పతనం: రూపాయి విలువ మరింత పతనమై సరికొత్త ఆల్‌టైం కనిష్ఠ స్థాయికి జారుకుంది. డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో పైస మేర బలహీనపడింది. దాంతో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.78.33కు చేరుకుంది. 

Updated Date - 2022-06-25T09:31:01+05:30 IST