స్విగ్గీకి రూ.3,348 కోట్ల నిధులు!

ABN , First Publish Date - 2021-04-17T06:42:20+05:30 IST

ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై ఆహారం సరఫరా చేసే స్విగ్గీలో 45 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,348 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు జపాన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గ జం సాఫ్ట్‌బ్యాంక్‌ చర్చలు జరుపుతోంది

స్విగ్గీకి రూ.3,348 కోట్ల నిధులు!

ఇన్వెస్ట్‌ చేయనున్న సాఫ్ట్‌బ్యాంక్‌ 


న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ ఆర్డర్‌పై ఆహారం సరఫరా చేసే స్విగ్గీలో 45 కోట్ల డాలర్ల (దాదాపు రూ.3,348 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు జపాన్‌ ఇన్వె్‌స్టమెంట్‌ దిగ్గ జం సాఫ్ట్‌బ్యాంక్‌ చర్చలు జరుపుతోంది. డీల్‌ త్వరలోనే కొలిక్కి రానున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా స్విగ్గీ మార్కెట్‌ విలువను 500 కోట్ల డాలర్లుగా లెక్కగట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫాల్కాన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌, అమాన్సా క్యాపిటల్‌, థింక్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌, కార్మిగ్నాక్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ నుంచి ఈ నెలలో కంపెనీ 80 కోట్ల డాలర్ల (సుమారు రూ.5,862 కోట్లు) నిధులు సమీకరించింది. స్విగ్గీ ప్రధాన పోటీదారైన జొమాటో ఈ ఏడాది పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు వచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఐపీఓలో భాగంగా 100 కోట్ల డాలర్ల మేర నిధులు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి భారీగా నిధులు సమీకరిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Updated Date - 2021-04-17T06:42:20+05:30 IST