Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖలో... కుక్కలతో నిరసన..

విశాఖ: దోమలు నివారించలేని అధికారులు.. కుక్కల కోసం కోట్లు వెచ్చించి పార్కులు నిర్మిస్తారా.. అంటూ వామపక్షాల నాయకులు మండిపడ్డారు. రూ.2కోట్లతో కుక్కల పార్కు నిర్మించేందుకు.. విశాఖ జీవీఎంసీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. దీన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ కార్యాలయం ఎదుట శనివారం సీపీఎం నేతలు కుక్కలతో నిరసన తెలియజేశారు. నగరంలో ప్రస్తుతం జ్వరాలు ప్రబలుతున్నాయని.. దోమల నియంత్రణకు చర్యలు తీసుకోకుండా.. కుక్కల గురించి ఆలోచించడం ఏంటని ప్రశ్నించారు.

పార్కులు

ప్రజలకే పార్కులకు దిక్కు లేదు.. ఉన్న పార్కులను అభివృద్ధి చేయకుండా.. కుక్కల కోసం పార్కులు కడతారా అంటూ మండిపడ్డారు. అన్ని అంశాల్లోనూ పన్నులు విధిస్తూ జనం సొమ్ము దోచుకుంటున్నారని ఆరోపించారు. ముందు మనుషుల గురించి ఆలోచించాలని సూచించారు. వెంటనే కుక్కల పార్కు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement