తెలంగాణలో ఫ్రెష్‌ టు హోమ్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-06-24T06:54:37+05:30 IST

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఫ్రెష్‌ టు హోమ్‌’ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంంది.

తెలంగాణలో  ఫ్రెష్‌ టు హోమ్‌ రూ.1,000 కోట్ల పెట్టుబడులు

బెంగళూరు: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ‘ఫ్రెష్‌ టు హోమ్‌’ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరిస్తోంంది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. కంపెనీ గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర జనాభాలో 98 శాతం మంది మాంసాహారులు కావడంతో ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆరు నెలల్లో హైదరాబాద్‌లో ‘ఫ్రెష్‌ టు హోమ్‌’ అమ్మకాలు ఆరు రెట్లు పెరిగాయి. కంపెనీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యాభైకి పైగా నగరాలు, పట్టణాల్లో చేపలు, చికెన్‌, మటన్‌ వంటి  రెండు వేలకు పైగా ఉత్పత్తులు విక్రయిస్తోంది.

Updated Date - 2022-06-24T06:54:37+05:30 IST