విడుదలైన అధికారిక ప్రకటన: ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్ష ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2021-12-09T18:55:03+05:30 IST

ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్షకు..

విడుదలైన అధికారిక ప్రకటన: ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్ష ఎప్పుడంటే..!

ఇంటర్‌నెట్‌డెస్క్: ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్షకు సంబంధించి రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఎట్టకేలకు ఈ పరీక్షకు సంబంధించిన తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఈ పరీక్షను వివిధ దశలలో నిర్వహించనున్నామని అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి పరీక్షకు 1.15 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు లక్షకుపైగా ఖాళీలను గ్రూప్-డి నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. 


పరీక్షకు పదిరోజుల ముందు ఎగ్జామ్ సెంటర్‌ను, పరీక్ష తేదీని ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని పేర్కొంది. అంతేకాకుండా గ్రూప్-డి పరీక్ష కోసం అప్లైయ్ చేసిన అభ్యర్థులలో 4,85,607మంది అప్లికేషన్లు ఇన్వాలిడ్ ఫొటోగ్రాఫ్, సంతకం వంటి కారణాల వల్ల రిజెక్ట్ అయ్యాయని తెలిపింది. దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫారం ఎడిట్ చేసుకునే లింక్‌ను డిసెంబర్ 15న విడుదల చేస్తామని, ఈ లింక్ డిసెంబర్ 26వరకు ఓపెన్‌లో ఉంటుందని ప్రకటించింది. ఈ లింకు https://rrbsecunderabad.nic.in/ లేదా ఇతర రీజినల్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. 



Updated Date - 2021-12-09T18:55:03+05:30 IST