చేనేత మగ్గంపై రాచరికపు హంగులు

ABN , First Publish Date - 2021-11-11T08:52:12+05:30 IST

హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని చేనేత కార్మికులు రాష్ట్ర చేనేత జౌళి శాఖ అధ్వర్యంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ ఉండే హిమ్రూ చీరలను మగ్గంపై ఉత్పత్తి చేస్తున్నారు.

చేనేత మగ్గంపై రాచరికపు హంగులు

కమలాపూర్‌ చేనేత కార్మికుల ప్రయోగం 

ఓరుగల్లు, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని చేనేత కార్మికులు రాష్ట్ర చేనేత జౌళి శాఖ అధ్వర్యంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ ఉండే హిమ్రూ చీరలను మగ్గంపై ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే ఒక చీరను తయారు చేసి ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలో పెట్టి మంత్రి కేటీఆర్‌సహా పలువురి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాక మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ ఉండే జీన్స్‌ ప్యాంట్ల బట్టనూ మగ్గంపై నేస్తున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసి న 10మంది మహిళలకు హిమ్రూ చీరల నేత కోసం శిక్షణ కార్యక్రమా న్ని గురువారం కమలాపూర్‌లో చేనేత జౌళి శాఖ కమిషనర్‌ శైలజా రామయ్యర్‌ ప్రారంభించనున్నారు. రాజకుటుంబీకుల వస్త్రాలుగా పేరు న్న హిమ్రూ ఉత్పత్తులను మగ్గాలపై తయారు చేసేందుకు కమలాపూర్‌ చేనేత మహిళలు సిద్ధమవుతున్నారు. సెలబ్రిటీలు, సినీ నటులు ఈ హిమ్రూ వస్త్రాలను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతారు. 

Updated Date - 2021-11-11T08:52:12+05:30 IST