Abn logo
Sep 1 2020 @ 18:39PM

పోర్న్ ‌స్టార్‌పై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు !

Kaakateeya

లాస్ ఏంజిల్స్: అమెరికాకు చెందిన పోర్న్ ‌స్టార్‌ రాన్ జెర్మీ(67)పై 20 అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఆయన వేధింపులకు పాల్పడిన వారిలో 15 ఏళ్ల వయస్సు గల బాలికతో సహా 12 మంది మహిళలు ఉన్నారని తెలిసింది. గడిచిన 16 ఏళ్ల కాలంలో ఆయన ఈ నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు మోపబడ్డాయి. 2014-19 మధ్య కాలంలోనే జెర్మీ నలుగురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సమాచారం. ఒకవేళ ఈ కేసుల్లో నేరం రుజువైతే ఆయన 250 ఏళ్లు కటకటాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.


ఇక జూన్‌లో అరెస్టైన జెర్మీపై వరుసగా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయనపై చాలా మంది మహిళలు ఫిర్యాదు చేశారని లాస్ ఏంజిల్స్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ ఆఫీస్ పేర్కొంది. కాగా, సోమవారం ఆయనను లాస్ ఏంజిల్స్ కౌంటీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జెర్మీ నేరాల చిట్టా బయటపడింది. ఇక కోర్టులో హాజరైన తర్వాత ట్విట్టర్ ద్వారా స్పందించిన జెర్మీ... “కోర్టులో నా అమాయకత్వాన్ని నిరూపించడానికి నేను వేచి ఉండలేను. అందరి సహకారానికి ధన్యవాదాలు.” అని పోస్టు పెట్టారు. ఇప్పటివరకు ఆయన 1,700 పోర్న్‌ మూవీస్‌లో నటించారని తెలుస్తోంది.  

Advertisement
Advertisement
Advertisement