Advertisement
Advertisement
Abn logo
Advertisement

సిరాజ్ తలపై రోహిత్ ఎందుకు కొట్టాడబ్బా.. వైరల్ వీడియో

జైపూర్: న్యూజిలాండ్‌తో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న బౌలర్ మహ్మద్ సిరాజ్ తలపై కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కటిచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అవుటైన రోహిత్ శర్మ డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్నాడు. అతడికి కిందన సిరాజ్, కేఎల్ రాహుల్ కూర్చున్నారు. ఆ తర్వాతి వరుసలో కోచ్ రాహుల్ ద్రవిడ్ కూర్చున్నాడు. 


రోహిత్ శర్మ, సిరాజ్, కేఎల్ రాహుల్ ముగ్గురూ ఒకే వైపునకు చూస్తుండగా, సడన్‌గా కేఎల్ రాహుల్ సిరాజ్ వైపు తిరిగాడు. అంతే, సిరాజ్ తలపై రోహిత్ ఒక్కటిచ్చాడు. రోహిత్ తలపై కొట్టినప్పటికీ సిరాజ్‌ ముఖంలో కానీ, రాహుల్ ముఖంలో కానీ ఎలాంటి భావాలు కనిపించకపోవడం గమనార్హం. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సిరాజ్‌ను ఎందుకు కొట్టాడో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 


Advertisement
Advertisement