అది నా జీవితంలోనే చీకటి కాలం: రోహిత్ శర్మ

ABN , First Publish Date - 2021-08-13T07:35:47+05:30 IST

2011 ప్రపంచకప్‌ భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. 28ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండా..

అది నా జీవితంలోనే చీకటి కాలం: రోహిత్ శర్మ

2011 ప్రపంచకప్‌ భారత్ నెగ్గిన విషయం తెలిసిందే. 28ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జెండా రెపరెలాడింది. అయితే ప్రస్తుతం టీమిండియా టాప్ ఓపెనర్‌గా పేరు పొందిన రోహిత్ శర్మకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. అప్పటికి జట్టులోకి రావడానికే రోహిత్ శర్మ అష్టకష్టాలు పడ్డాడు. అయితే తాజాగా రోహిత్ శర్మ అప్పటి తన పరిస్థితి గురించి వివరించాడు. ఆ సమయం తన జీవితంలో చీకటి కాలమని అన్నాడు. ‘2011 ప్రపంచకప్‌కు ఎంపిక కాకపోవడం నిజంగా నా అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లోనే చీకటి సమయం. అప్పుడు నన్ను నేనే తిట్టుకున్నాను. అయితే ప్రపంచకప్ ముందు నా ఆట అంత మెరుగ్గా లేకపోవడమే అందుకు కారణం అయి ఉండవచ్చు’ అని రోహిత్ పేర్కొన్నాడు.


కాగా.. అయితే 2019 ప్రపంచకప్‌లో కోహ్లీ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్ అద్భుత ప్రదర్శనతో రాణించాడు. టోర్నీలో అత్యధికంగా 5 సెంచరీలు సాధించడమే కాకుండా.. 81 సగటుతో 648 పరుగులు చేసి టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Updated Date - 2021-08-13T07:35:47+05:30 IST