కోహ్లీ వద్దనుకుంటే.. రోహిత్ రెడీగా ఉన్నాడు: ఆకాశ్ చోప్రా

ABN , First Publish Date - 2020-07-01T04:20:06+05:30 IST

భవిష్యత్తులో ఎప్పుడైనా టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ స్థానంలో వేరేవారిని తీసుకోవాలంటే రోహిత్ శర్మ కన్నా బెస్ట్ ఆప్షన్ లేదని

కోహ్లీ వద్దనుకుంటే.. రోహిత్ రెడీగా ఉన్నాడు: ఆకాశ్ చోప్రా

ముంబై: భవిష్యత్తులో ఎప్పుడైనా టీమిండియా కెప్టెన్‌గా కోహ్లీ స్థానంలో వేరేవారిని తీసుకోవాలంటే రోహిత్ శర్మ కన్నా బెస్ట్ ఆప్షన్ లేదని ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా చెప్పాడు. కెప్టెన్‌ను మార్చాలని గనుక టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తే రోహిత్ శర్మ బెస్ట్ ఆప్షన్ అని ఆకాశ్ అభిప్రాయపడ్డాడు. ‘కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నా, లేకున్నా అతని ఆటతీరులో పెద్ద మార్పులేవీ ఉండవు. కాబట్టి కోహ్లీ స్థానంలో వేరే వాళ్లను కెప్టెన్ చేయాలనుకుంటే రోహిత్ ఉండనే ఉన్నాడు’ అని ఆకాశ్ తెలిపాడు. ఇప్పటి వరకు కోహ్లీ టీమిండియాకు 89 వన్డేలు, 55 టెస్టులు, 37 టీ20 మ్యాచుల్లో సారధ్యం వహించాడు. వీటిలో 62 వన్డేలు, 33 టెస్టులు, 22 టీ20లు భారత్ గెలిచింది.

Updated Date - 2020-07-01T04:20:06+05:30 IST