Abn logo
Oct 28 2021 @ 07:23AM

రోడ్డు ప్రమాదంలో సైనికుడి మృతి

వేలూరు(Chennai): రోడ్డుప్రమాదంలో ఓ సైనికుడు మృతిచెందాడు. రాణిపేట జిల్లా భానావరం సమీపం పుదుప్పేటకు చెందిన పళని (56) కుమా రుడు అజిత్‌కుమార్‌ (26) కశ్మీర్‌ సైనికదళంలో పనిచేస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అజిత్‌ నెలరోజుల సెలవుపై ఈ నెల 20వ తేదీ స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం పులివల్లమ్‌లోని బంధువుల ఇంటికి వెళ్ళిన అజిత్‌ రాత్రి 10 గంటలకు ద్విచక్రవాహనంపై ఇంటి కి బయల్దేరాడు. మధ్యలో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో అజిత్‌ సంఘటనా స్థలంలో మృతిచెందాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...