బాపట్ల: జిల్లాలోని వేటపాలెం మండలం పందిళ్ళపల్లి బైపాస్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ధర్మరాజు(20), కనకారావు(41)గా గుర్తించారు.
ఇవి కూడా చదవండి