Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంజాయ్‌ చేశా

twitter-iconwatsapp-iconfb-icon
రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంజాయ్‌ చేశా

తెలంగాణ ఇస్తారో.. ఇవ్వరో.. సోనియా నాకు చెప్పలేదు

అమెరికా అయినా, తెలంగాణ అయినా అలాగే ఉండాలి

మేము ఏ పార్టీ తరపునా లేమని అన్ని పార్టీలూ ఫిర్యాదు చేస్తున్నాయి

04-07-2011న రివర్స్‌ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ తానాలో ఆర్కే

ఆంధ్రజ్యోతిది నైతికతతో కూడిన ధైర్యమని ప్రశంస


ఆర్కే: అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల గురించి ప్రస్తావన లేకుండా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం.


నా పేరు చిన్నారావు. బొబ్బిలి నుంచి వచ్చాను. టీవీ చానల్‌లో అంతా ఉన్నదున్నట్లు చూపిస్తున్నారు. మీరు ఓపెన్‌ హార్ట్‌ ప్రోగ్రాం ద్వారా జర్నలిజం విలువలు కాపాడాలని కోరుతున్నాను.

ఆర్కే: డబ్బుల కోసం వార్తలు వేసే వార్తాపత్రికలను బయటపెట్టిన ‘మోరల్‌ కరేజ్‌’ ఆంధ్రజ్యోతిది.


నా పేరు వెంకట రమణ. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు సెక్రటరీని. మొదటగా తెలుగు చానళ్ల గురించి.. ఒక చానల్‌లో చూపించిన దాన్ని మరొకరు తప్పని చెబుతారు. ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకోవాలి. జగన్‌కు కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఐదు లక్షలకు పైగా మెజారిటీ రావడమనేది దేనికి సంకేతం. ఆయనను కాబోయే సీఎం అనొచ్చా?

ఆర్కే: ఏ చానల్‌ ఏది చూపించినా.. ప్రేక్షకులే నిజమో.. అబద్ధమో నిర్ణయించాలి. రాజకీయ పార్టీలకు, కులాలకు అనుబంధంగా ఉండే చానళ్లు మొదలయ్యాయి. మీరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కాబట్టి.. ఏ న్యూస్‌ తప్పో, ఏది కరెక్టో చెప్పే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయండి. ఇక జగన్‌ విషయమంటారా.. ‘గుర్రం ఎగరావచ్చు’.


నా పేరు కిరణ్‌. గుంటూరు నుంచి వచ్చాను. మీ యంగిస్థాన్‌ బాగుంటుంది. మీరు ఈ కార్యక్రమం చివరిలో సందేశం ఇస్తే బాగుంటుంది.

ఆర్కే: చెప్పాల్సిందే కానీ.. సమయం సరిపోవడం లేదు.


మీ పేపర్‌, చానల్‌ ఒక పార్టీకి, వర్గానికి మద్దతు ఇస్తున్నారని వాదన ఉంది?

ఆర్కే: అబద్ధం. ఆంధ్రజ్యోతి మీద రాజకీయ పార్టీలన్నీ ఫిర్యాదు చేస్తాయి. దీంతో మేము ఎవరి తరపూ లేమని అర్థం.


నాపేరు కిషోర్‌. మీరు ఎవరినన్నా ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ముందుగా ప్రశ్నలు చెబుతారా? ఎవరినన్నా ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంజాయ్‌ చేశారా?

ఆర్కే: క్వశ్చన్‌ పేపర్‌ లీకేజీ ఉండదు. రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంజాయ్‌ చేశాను.


నాపేరు దిలీప్‌. న్యూస్‌ చానల్‌ అనేది కుటుంబం మొత్తం చూస్తారు. మీరు ఎన్డీ తివారీ ఉదంతాన్ని బయటపెట్టినప్పుడు ‘ఎంతటి రసికుడవో’ అంటూ పాట.. దృశ్యాల ప్రభావం ఇబ్బందిగా ఉంటుంది.

ఆర్కే: ఆ ఉదంతాలు మసక బారించి ప్రసారం చేశాం. అలా చూపించకపోతే మీరూ చూడరు. అసభ్య దృశ్యాలు బ్లర్‌ చేస్తాం.


యూ ఆర్‌ రామోజీ ఇన్‌ ది మేకింగ్‌. ఈ కామెంట్‌ను మీరెలా తీసుకుంటారు?

ఆర్కే: నేను నేనుగానే ఉంటా. కాపీగా ఉండను.

రామ్‌గోపాల్‌ వర్మని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంజాయ్‌ చేశా

మా పనే అది కాబట్టి, మేం అడుగుతాం


1999లో ఆంధ్రజ్యోతి దివాలా తీసినప్పుడు మీరు జర్నలిస్టు. 2002లో దాన్ని మీరే మొదలుపెట్టారు. అప్పుడు ‘ఫియర్‌ నో ఫేవర్‌’ అని బాస చేశారు. ఇంకా దాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ వస్తుందా? రాదా?

ఆర్కే: దాన్ని అనుసరిస్తున్నానని నమ్ముతాను. తెలంగాణ ఇస్తారో? ఇవ్వరో? సోనియా నాకు ఎప్పుడూ చెప్పలేదు.


నా పేరు రవికిరణ్‌. పిడుగురాళ్ల నుంచి వచ్చాను. లగడపాటి రాజగోపాల్‌ దగ్గరకు వెళ్లి విలేకరులు తెలంగాణ మీద ఆయన స్పందన తీసుకుని కేసీఆర్‌ను దాని మీద ప్రశ్నిస్తారు. గొడవ పెడతారు? ఎందుకలా?

ఆర్కే: మేం అడిగితే వారెందుకు చెప్పాలి. మా పనే అది కాబట్టి, మేం అడుగుతాం.


నాపేరు త్రిలోక్‌. మీరు ఆంధ్రజ్యోతి బిల్డింగ్‌ నిర్మించినప్పుడు ఉల్లంఘనకు ఎంత లంచమిచ్చారు?

ఆర్కే: ఆంధ్రజ్యోతి పాత భవనం వేరే చోట ఉండేది. అక్కడ రోడ్డు విస్తరణలో కొద్ది భాగం తీసేయాల్సి వచ్చినప్పుడు మునిసిపల్‌ కార్పొరేషన్‌ వారు వచ్చి అడిగితే.. వేరే చోట నాకున్న స్థలంలో భవనం నిర్మించుకుంటానని చెప్పాను. అలాగే చేశాను. వారి అనుమతితోనే పత్రికను నా భవనంలోకి మార్చినా, ఉల్లంఘనలు ఉన్నాయని ఒప్పుకుంటాను. నా మీద ఏ కేసులూ పెట్టలేక ఆ కేసు పెట్టారు.


నేను నన్నపనేని రాజకుమారి. ఈ మధ్య ఒబామా గారు మాట్లాడుతూ.. అమెరికా పిల్లలు బాగా చదువుకోకపోతే భారతీయులు, చైనీయులు ఉద్యోగాలు తన్నుకుపోతారని చెబుతున్నారు. ఇక్కడకు వచ్చిన వారు ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోవాలని అంటే ఏం చేయాలి? ఆ సమస్య వస్తే ఇక్కడి వారిని అక్కడకు తీసుకువెళ్లగలమా? ఇక్కడ కులతత్వం, ప్రాంతీయ తత్వం లేకుండా బతుకుతున్నారు.

ఆర్కే: ఇది ఎక్కడైనా వస్తుంది. వందలాది సంవత్సరాల క్రితం ఫిజి వెళ్లిన వారిపై కూడా స్థానికులు తిరగబడ్డారు. అమెరికా అయినా.. తెలంగాణ అయినా ‘లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌’ అన్నట్లు ఉంటే సమస్య ఉండదు. ఇక్కడ కుల, ప్రాంతీయ తత్వాలు లేవనడం సరికాదు. ఆ విషయంలో మనమే మెరుగు.


ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుగుతాడా? ఒకేసారి ఎదుగుతాడా? మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీని ఫ్రాడ్‌ అని ఆర్‌బీఐ చెప్పినా మీరెందుకు రాయలేదు?

ఆర్కే: ఒకేసారి ఎదిగితే కింద పడతాడు. దేనికైనా టైం రావాలి. మార్గదర్శి విషయానికొస్తే దాని గురించి మొదట రాసింది మేమే.


నా పేరు స్వప్న. భారత దేశంలో ఒక విద్యార్థి సామాజిక సేవ చేస్తేనే అడ్మిషన్‌ అని నిబంధన పెడితే బాగుంటుంది కదా?

ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యా వ్యవస్థలో నైతిక విలువలు నేర్పడమనేది లేదు. నేను అలాంటి సామాజిక బాధ్యత కోసమే యంగిస్థాన్‌ కార్యక్రమాన్ని చేస్తున్నాను.


నా పేరు పద్మశ్రీ. భాషలన్నింటికన్నా తెలుగు లెస్స. మేమే తానా ద్వారా రెండు యూనివర్సిటీల్లో తెలుగు టీచర్లను పెట్టి తెలుగు నేర్పిస్తున్నాం. మీ చానళ్లలో యాంకర్ల తెలుగును వినలేకపోతున్నాం.

ఆర్కే: నిజమే. తెలుగును సరిగా మాట్లాడే వారు లేరు. శిక్షణ ఇచ్చే వారూ లేరు.


నాపేరు సంతోష్‌. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తారా?

ఆర్కే: నేను సమర్థిస్తాను. మీరు ఇలాంటి విషయాలను ఆలోచించకుండా మరింత పరిపక్వంగా ఆలోచించండి. తెలంగాణ గురించి కాలమే నిర్ణయిస్తుంది.


ఆర్కే: ఇప్పటి వరకూ సీరియస్‌గానూ, చిలిపిగానూ మాట్లాడుకున్నాం. అందరం ఎంజాయ్‌ చేశాం. థాంక్యూ వెరీ మచ్‌.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.