ఆర్కే మఠ్‌లో కమ్యునికేషన్ స్కిల్స్ సర్టిఫికేట్ కోర్సు

ABN , First Publish Date - 2020-03-06T23:09:03+05:30 IST

ఉన్నతమైన ఆలోచనలతోనే ఉన్నతమైన కార్యాలు సాధ్యమవుతాయంటారు స్వామి వివేకానంద.

ఆర్కే మఠ్‌లో కమ్యునికేషన్ స్కిల్స్ సర్టిఫికేట్ కోర్సు

హైదరాబాద్: ఉన్నతమైన ఆలోచనలతోనే ఉన్నతమైన కార్యాలు సాధ్యమవుతాయంటారు స్వామి వివేకానంద. దీంతో పాటు చక్కటి కమ్యునికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి.. ఎలా మాట్లాడాలి.. అనే విషయాలపై అవగాహన లేకపోతే.. గుంపులో గోవిందయ్యగా మిగిలిపోవడం ఖాయం అంటూరు వ్యక్తిత్వ వికాస నిపుణులు. ఈ అంశంపైనే హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్’ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. 

 

‘కమ్యునికేషన్ స్కిల్స్ సర్టిఫికేట్ కోర్సు’ పేరుతో మార్చి 9 నుంచి ఏప్రిల్ 4 వరకు నాలుగు వారాల పాటు సర్టిఫికేట్ కోర్సు అందిస్తోంది. సోమవారం నుంచి శనివారం వరకు ఉండే ఈ తరగతలు.. ఉదయం 7.50 నుంచి 9.15 వరకు జరగుతాయి. బృంద చర్చలు, ఉపన్యాస కళ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వారు మాత్రమే అర్హులు.

 

ఆర్‌కే మఠ్‌లో యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందింప చేసే కోర్సులు కూడా నిర్వహిస్తున్నారు. మహిళలకు, న్యాయవాదులకు కూడా ప్రత్యేక కోర్సులున్నాయి. బాలల కోసం బాల వికాస్ నిర్వహిస్తున్నారు.

 

మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

 

రామకృష్ణ మఠం పని వేళలు : ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు; సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు.

Updated Date - 2020-03-06T23:09:03+05:30 IST