వరల్డ్‌ యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌కు రిత్విక్‌

ABN , First Publish Date - 2020-11-30T10:42:59+05:30 IST

యువ అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) రాజా రిత్విక్‌ వరల్డ్‌ యూత్‌ ర్యాపిడ్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఆన్‌లైన్‌లో

వరల్డ్‌ యూత్‌ ర్యాపిడ్‌ చెస్‌కు రిత్విక్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): యువ అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) రాజా రిత్విక్‌ వరల్డ్‌ యూత్‌ ర్యాపిడ్‌ ఆన్‌లైన్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పనకు అర్హత సాధించాడు. కరోనా కారణంగా ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో రిత్విక్‌ అండర్‌-16 విభాగంలో తలపడనున్నాడు. వచ్చే నెల 11 నుంచి 13 వరకు ఈ చాంపియన్‌షి్‌ప జరగనుంది. రిత్విక్‌ ఖాతాలో ప్రస్తుతం 2408 ఎలో రేటింగ్‌ పాయింట్స్‌ ఉన్నాయి.

Updated Date - 2020-11-30T10:42:59+05:30 IST