పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ABN , First Publish Date - 2021-01-17T08:17:04+05:30 IST

తక్కువ ఎత్తులో వీస్తున్న తూర్పు గాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

విశాఖపట్నం, అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): తక్కువ ఎత్తులో వీస్తున్న తూర్పు గాలుల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రానున్న 4 రోజులు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలోనే ఉష్ణోగ్రతలు పెరగడం విశేషం. శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు తునిలో 33, మచిలీపట్నం, అమరావతి, నందిగామల్లో 32 డిగ్రీలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా రాత్రులు చలి కొనసాగుతోంది. అనేక చోట్ల ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఉండటంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖ ఏజెన్సీలోని జి.మాడుగులలో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2021-01-17T08:17:04+05:30 IST