UK Polls: రిషి సునాక్‌కు అడుగంటుతున్న అవకాశాలు.. బ్రిటన్‌ ప్రధాని పీఠం అందని ద్రాక్షే!

ABN , First Publish Date - 2022-07-31T13:15:10+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్‌ బాగా వెనకబడ్డారు. ఆయన గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సర్వేల్లో తేలింది.

UK Polls: రిషి సునాక్‌కు అడుగంటుతున్న అవకాశాలు.. బ్రిటన్‌ ప్రధాని పీఠం అందని ద్రాక్షే!

రేసులో దూసుకెళ్తున్న ట్రస్‌

లండన్‌, జూలై 30: బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్‌ బాగా వెనకబడ్డారు. ఆయన గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పలు సర్వేల్లో తేలింది. ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్‌, లిజ్‌ ట్రస్‌‌ల మధ్య పోరు తుది దశకు చేరుకున్న సమయంలో ఇద్దరి విజయావకాశాలపై అంచనాలు మారిపోతున్నాయి. తదుపరి ప్రధానిగా అవకాశాలు సునాక్‌10శాతం ఉంటే.. ట్రస్‌కు 90శాతం ఉందని స్థానిక బెట్టింగ్‌ ఎక్స్ఛేంజీ సంస్థ స్మార్కెట్స్‌ అంచనా వేసింది. వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో అధికార కన్జర్వేటివ్‌ పార్టీ తదుపరి ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియ చేపట్టింది. కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతు నూ చూరగొన్నవారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరూ 6 వారాల దేశ పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే పలు నగరాల్లో సునాక్‌, ట్రస్‌లు టోరీ ఓటర్లతో ముఖాముఖి చర్చల్లో పాల్గొన్నారు. వచ్చేవారం నుంచి టోరీ సభ్యులకు బ్యాలెట్‌ పేపర్లు పంపిణీ కానున్నాయి. సెప్టెంబరు 2న సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేసిన బ్యాలెట్లను సమర్పించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 5న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-07-31T13:15:10+05:30 IST