టీ20 తుది జట్టులో Rishabh Pant కు చోటు కష్టమే : Wasim Jaffer

ABN , First Publish Date - 2022-06-19T20:18:27+05:30 IST

37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసి అద్భుతంగా రాణిస్తున్న దినేష్ కార్తీక్(Dinesh Karthik) ఫామ్‌పై టీమిండియా ప్లేయర్లు ఆశ్చర్యపోతున్నారు.

టీ20 తుది జట్టులో Rishabh Pant కు చోటు కష్టమే : Wasim Jaffer

ముంబై: 37 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసి అద్భుతంగా రాణిస్తున్న దినేష్ కార్తీక్(Dinesh Karthik) ఫామ్‌పై టీమిండియా ప్లేయర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇదే సమయంలో రిషబ్ పంత్(Rishabh Pant) పేలవ ప్రదర్శన పట్ల ఆటగాళ్లు తెగ ఆందోళన చెందుతున్నారు. కీలక ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం అందుబాటులో లేరు. కానీ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో వీళ్లకు చోటుదక్కడం దాదాపు ఖాయం. వీరితోపాటు చక్కగా రాణిస్తున్న దినేష్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా(Hardik Pandya)లకు కూడా చోటు దక్కడం ఖాయంగానే కనిపిస్తోంది. 


ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్(Wasim Jaffer) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటే దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్‌(Rishabh Pant)కు తుది జట్టులో  చోటుదక్కడం కష్టమేనని జోస్యం చెప్పాడు. టీ20 తుది జట్టులో స్థానం లభించకపోవచ్చునన్నాడు. తదుపరి టీ20 సిరీస్‌కు జట్టును ఎంపిక చేస్తే తుది జట్టులో దినేష్ కార్తీక్ ఆడడం ఖాయం. ఇందులో సందేహమే లేదు. ఫిట్‌గా ఉంటే కేఎల్ రాహుల్ కూడా జట్టులో ఆడతాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ 3-4 జట్టులోకి వస్తారు. కాబట్టి ఫైనల్ 11లో రిషబ్ పంత్‌కు చోటు కష్టమేనని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో(ESPN CricInfo)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్‌ను పక్కనబెడితే ప్రస్తుతానికైనా పంత్ కంటే దినేష్ కార్తీక్ మెరుగ్గా రాణిస్తున్నాడు. కాబట్టి దినేష్‌కే మొగ్గు ఉంటుందని జాఫర్ జోస్యం చెప్పాడు.

Updated Date - 2022-06-19T20:18:27+05:30 IST