Abn logo
Mar 2 2021 @ 21:35PM

రేవంత్ వర్గం బెదిరిస్తున్నారు: షర్మిల ప్రధాన అనుచరుడు

హైదరాబాద్: తనపై భౌతిక దాడులకు దిగుతామంటూ రేవంత్ సైన్యం పేరట తనకు బెదిరింపులు సందేశాలు, ఫోన్ కాల్స్ వచ్చాయని షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. తనకు వాట్సాప్‌లో వచ్చిన సందేశం ఆధారంగా బుధవారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. తాజాగా రేవంత్‌రెడ్డిపై కొండారాఘవరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఆగ్రహంతోనే తనకు బెదిరింపులు వచ్చాయని ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు దిగుతామని తనను హెచ్చరిస్తున్నట్లు కొండా రాఘవరెడ్డి మంగళవారం పర్కొన్నారు.

Advertisement
Advertisement
Advertisement